AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో నేడు షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.8.8 కోట్ల విలువ చేసే పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు పూర్తిగా దగ్ధం అయినట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.