అరుదైన రికార్డుకు చేరువలో షమీ

72చూసినవారు
అరుదైన రికార్డుకు చేరువలో షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. గాయంతో గత 15 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న షమీ ఇవాళ ఇంగ్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో షమీ 2 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో 450 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో పేసర్‌గా షమీ నిలవనున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597), జవగల్ శ్రీనాథ్(551).. షమీ కన్నా ముందున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్