TG: రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు ఎన్‌ఈసీపీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు దారులకు సరకులతో పాటు ఇకపై గుడ్లు కూడా అంద చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎన్‌ఈసీపీసీ) ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన అందరికీ నెలకు కనీసం 30 గుడ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.