AP: రాష్ట్రంలో అర్హులకు మాత్రమే పెన్షన్ ప్రయోజనం దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వెరిఫికేషన్‌ను వేగవంతం చేసింది. ఈ మేరకు మార్చి 15 తుది గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం మొత్తం 8,18,900 మంది పెన్షన్లను పొందుతుండగా.. వీరిలో ఇప్పటి వరకు 1.20 లక్ష మంది పెన్షనర్ల వెరిఫికేషన్ పూర్తి అయింది. అయితే ఇంకా దాదాపు 7 లక్షల పెన్షన్లను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఆ తరువాతే అనర్హులకు పెన్షన్ తొలగించనుంది.