అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య

81చూసినవారు
అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య
TG: యాదాద్రి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య మూడున్నర ఎకరాల్లో పత్తి వేయగా వర్షాభావంతో దిగుబడి రాలేదు. దీంతో రూ.14 లక్షల అప్పు తీర్చలేక పురుగుమందు తాగి చనిపోయారు. సిరిసిల్ల జిల్లా పోతుగల్లో దేవయ్య(51) నీరు లేక వరి పంట ఎండిపోయింది. అప్పు తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి(D) మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్ (D) వేములపల్లిలో వెంకన్న పంట దిగుబడి రాకపోవడంతో అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్