మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ క్రమంలోనే ‘శక్తి’ పేరిట ప్రత్యేక యాప్‌ను మళ్లీ తీసుకురానున్నట్లు అనిత పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఈ యాప్‌ను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.