ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్‌కు చెందిన ‘అషుజైన్’ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే మహిళలకు అషుజైన్ మాత్రం 53 ఏళ్ల వయసులోనూ పీహెచ్‌డీ చేసి ఇన్ఫిరేషన్‌గా నిలుస్తున్నారు. అలాగే యువతీ యువకులతో పోటీపడి ‘ఎంటీవీ రోడీస్’ షోలో స్థానం సంపాదించి సూపర్ ఉమెన్ అనిపించుకున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే వయసుతో సంబంధం లేకుండా ఏ రంగంలో అయినా రాణించవచ్చని నిరూపిస్తున్నారు.