AP: ఏలూరు జిల్లా ఉండి మండలంలో ఘోరం జరిగింది. వివాహితపై ఇద్దరు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి, డబ్బులు ఇవ్వాలని బాధితురాలిని బెదిరించేవారు. బాధితురాలు పలు దఫాలుగా రూ.2.5 లక్షలు ఇచ్చింది. అయినా బెదిరింపులు ఆగలేదు. దాంతో వివాహిత పోలీసులను ఆశ్రయించారు. నిందితులు యర్రంశెట్టి రవి, సోమేశ్వరరావుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.