బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో మంగళవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.440 పెరగడంతో రూ.90,000 ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.400 పెరగడంతో రూ.82,500 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇవాళ కిలో వెండిపై ఏకంగా రూ.1100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది.