ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి గెలుపొందిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపైన ఫోకస్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి తాజాగా మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చినట్టుగా సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్
రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాలు రామ్
చరణ్ కొనుగోలు చేశారు. రెండు ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణం చేసి, మిగిలినదంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్
ఉపాసన దంపతులు భావిస్తున్నారట.