రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న

56చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
AP: అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క గజం కూడా సాయిల్ టెస్ట్ చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చి ఇప్పటివరకూ 3 లక్షల ఎకరాలకు సాయిల్ టెస్ట్ చేసిందన్నారు. వచ్చే ఏడాది ఆరున్నర లక్షల ఎకరాల సాయిల్ టెస్ట్ చేస్తామన్నారు. త్వరలో రైతులకు టార్పాలిన్ పట్టాలు అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్