స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో డ్రైవర్ రహిత మినీ బస్సు చక్కర్లు కొడుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో రూపొందించిన ఈ వాహనాన్ని ప్రయోగాత్మకంగా తిప్పుతున్నారు. రోజూ 2.2 కి.మీ. మేర ప్రయాణిస్తున్న ఈ బస్సు నాలుగు స్టాపుల్లో ఆగుతోంది. ప్రయోగాత్మక సర్వీసు అయినందున ఎక్కినవారి నుంచి టికెట్ డబ్బులు వసూలు చేయడంలేదని సమాచారం.