భారత అథ్లెట్ విస్పీ ఖరాడి మరో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆయన తన రెండు చేతులతో 4 క్వింటాల భారీ బరువున్న రెండు స్థంబాలను బ్యాలెన్స్‌గా ఆపాడు. అతడు వాటిని అలా రెండు నిమిషాలపాటు కిందపడిపోకుండా తన చేతులతో పట్టుకున్నాడు. అతని ఈ ఫీట్ గిన్నిస్ రికార్డులో నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.