బెట్టింగ్ యాప్స్‌పై ఆర్డీసీ ఎండీ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నటుడు సంపూర్ణేష్ బాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల బాగుపడినట్టు చరిత్రలో లేదని, కన్న వాళ్ల గురించి ఆలోచించి వీటికి దూరంగా ఉండాలని సందేశాత్మక వీడియోను రిలీజ్ చేశారు.