జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. తండ్రి ముగ్గురు పిల్లలను చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్‌లిటి గ్రామంలో సనాల్ అన్సారీ (36) కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లగా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజూమున పిల్లలకు ఉరేసి చంపేసి తాను సూసైడ్ చేసుకున్నాడు. పక్కింటివాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.