AP: పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా సుంకిరెడ్డిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా.. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్నామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు వెంటనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.