తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. సాయి వర్ధన్ ముదిగొండకు చెందిన వాడు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.