AP: అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్.. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అయితే చరణ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.