AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖపట్నం కోర్టుకు వెళ్లనున్నారు. తనపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై గతంలో ఆయన పరువునష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం క్రాస్ ఎగ్జామినేషన్‌కు మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.