ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం రూ.600 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

81చూసినవారు
ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం రూ.600 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం ఏపీ ప్రభుత్వం శుక్రవారం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఏపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.788 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ పేర్కొన్నారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని, విద్యాసంస్థలు ఫీజు చెల్లించాలని విద్యార్థులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత పోస్ట్