ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ శుక్రవారం పర్యటించారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారంలో రాజధాని పనులు ప్రారంభిస్తామని.. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచామని.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.