TG: భార్య వెంకటమాధవిని అత్యంత క్రూరంగా చంపిన గురుమూర్తి పోలీసులనే ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 'అవును నేనే చంపా. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి. అంతా కోర్టులోనే చూసుకుంటా' అని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. ఇంట్లో రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడంతో ‘ముక్కలు'గా నరికిన విషయం నిజమేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం.