AP: ప్రజా నాయకుడు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రవీంద్ర పేదల పక్షాన నిలిచి నిరంతరం వారి అభివృద్ధి కోసం కృషి చేశారని, అరాచక శక్తులతో పోరాడి ప్రజల గుండెల్లో అస్తమించని రవిగా కొలువుదీరారని అన్నారు. టీడీపీ నాయకులు, మంత్రిగా ఆయన సేవలు మరువలేనివి అని, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు.