ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శుక్రవారం భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళన చెంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇది భూమికి 5 కి.మీ లోతులో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు రావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.