రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్- నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. గత ఏడాది యూపీలో 23,652 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయారు.