ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత స్టార్ విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించారు. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔటైన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న కోహ్లీని కొంతమంది ఆసీస్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. తమ మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఆసీస్ అభిమానుల కామెంట్స్‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన విరాట్ వెనక్కి వచ్చి వారిపైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.