AP: గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున టెంట్ ఏర్పాటు చేసి, ఆయనకు ఓటేయాలని పోస్టర్లు అంటించారు. దాంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పీడీఎఫ్ చర్యలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు పోలింగ్ అధికారులు పోస్టర్లను తొలగించారు.