విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రిగా మరోసారి తన ప్రమాణ స్వీకారం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. "విశాఖ ఏపీలోనే పెద్ద సిటీ. అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలోని ఏ నగరంలోనూ లేదు. విశాఖ నుంచే సీఎం పాలన సాగిస్తే, అప్పుడు విశాఖ నగరం HYD, బెంగళూరు, చెన్నై వంటి వాటితో అభివృద్ధిలో పోటీ పడటానికి తలుపులు తెరచుకుంటాయి. అందుకే నా తదుపరి పాలన విశాఖ నుంచే జరుగుతుంది." అని ఓ ఇంటర్వ్యూలో సీఎం తెలిపారు.