ఏడాదిన్నర తర్వాతే కేబినెట్‌లోకి నాగబాబు!

70చూసినవారు
ఏడాదిన్నర తర్వాతే కేబినెట్‌లోకి నాగబాబు!
AP: మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కీలకంగా పని చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాగబాబును లోక్‌సభ ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి పవన్ త్యాగం చేశారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారని టాక్ వినిపించింది. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాతే నాగబాబు కేబినెట్‌లోకి రావొచ్చని సమాచారం.

సంబంధిత పోస్ట్