మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూణే జిల్లా శుక్రవార్ పేట్ పోలీస్ పోస్ట్ సమీపంలోని ఒక గోడౌన్‌లో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.