ఏపీలోని కూటమి సర్కాలు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్లు సర్కార్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని.. విద్యాసంస్థలకు స్పష్టం చేసింది. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని.. హాల్ టికెట్లు నిలిపివేస్తే చర్యలుతప్పవని హెచ్చరికలు జారీచేసింది.