AP: తన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికకు ఇప్పుడున్న అవకాశాలేమిటనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఐదుగురి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ ఐదు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్థానాల్లో గెలుపొందే వారు మార్చి 29 తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్నారు.