AP: సినిమా టికెట్ ధరల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు పెట్టుబడులు కావాలంటే టికెట్ ధరలు పెంచాల్సిందేనని ఆయన చెప్పారు. సినిమా వాళ్లు ప్రతి రూపాయికి 18 శాతం జీఎస్టీ కడుతున్నారని తెలిపారు. ‘నేను నటించిన భీమ్లా నాయక్ సినిమాకు రేట్లు పెంచకపోగా తగ్గించారు. చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపకపోయినా మేం వివక్ష చూపించలేదు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు.’ అని పవన్ చెప్పారు.