ఆదోనిలో మెడికల్ కళాశాల పనులను ప్రారంభించాలి

76చూసినవారు
ఆదోనిలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునఃప్రారంభించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైచిగేరిలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ. వైద్య కళాశాల పనులు అర్దాంతరంగా ఆగిపోవడం వల్ల ఈ ఏడాది అడ్మిషన్లు నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.

సంబంధిత పోస్ట్