ఆదోని కల్లుగీత కార్మికుల సహకార సంఘం కమిటీ ఎన్నికకు 11 మంది సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఆదోని ఎక్సైజ్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ గా ఫజల్ వ్యవహరించగా, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ శివరాముడుల ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ జరిగింది. మొత్తం 11 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్ సీఐ సైదుల్లా తెలిపారు.