ఆదోని: ఆటోలో తరలిస్తున్న 39 ప్యాకెట్ల రేషన్ బియ్యం స్వాధీనం

81చూసినవారు
ఆదోని: ఆటోలో తరలిస్తున్న 39 ప్యాకెట్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆదోని పట్టణంలోని కమేళా కాలనీ వద్ద వన్ టౌన్ పోలీసులు బుధవారం 39 సంచుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిరోజేబేగం అనే మహిళ ఆటోలో 39 సంచులు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా, కమేళా కాలనీ వద్ద దాడి చేసుకున్నట్లు చెప్పారు. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీరామ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్