ఆదోని: నేటి నుంచి మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కోనుగోలు

68చూసినవారు
ఆదోని: నేటి నుంచి మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కోనుగోలు
కర్నూలు జిల్లాలో బుధవారం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కోనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 53 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 9 వేల టన్నుల కందులు కర్నూలు, 8 వేల టన్నులు నంద్యాల జిల్లాలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్