ఆదోనిలో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్

74చూసినవారు
ఆదోనిలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని కార్మికులకు మున్సిపల్ కమిషనర్ కృష్ణ సూచించారు. శనివారం ఉదయం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, పాత ఓల్డ్ బ్రిడ్జి దగ్గర డ్రైనేజీ పనులను పరిశీలించారు. అయన మాట్లాడుతూ. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అన్నారు. అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్