నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బత్తిన శివ ప్రసాదరావును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. 1993 మార్చి 17న న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ కోసం ఎన్‌రోల్ అయిన శివ ప్రసాదరావు, ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, టిడిపి నేత మద్దూరి బార్గవరామ్, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు.