పీర్ల దేవుడిని చూపిస్తానని ఓ బాలుడు 10 గ్రామాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఆలూరు మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం కురవల్లికి చెందిన బాలుడు పంట పొలాల్లో పీర్ల దేవుడిని చూపిస్తానని చెప్పాడు. నమ్మిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బాలుడి చుట్టూ గుమిగూడారు. చివరికి పొలాల్లో ముందుగా దాచిపెట్టిన పీర్ల ప్రతిమను చూపించడంతో బాలుడికి చీవాట్లు పెట్టి వెనుతిరిగారు.