ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం దేవనకొండలో వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రజక కోసం ఫెడరేషన్ కార్పొరేషన్ చేసి నిధులు కేటాయించకుండా కాలయాపన చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి గత ఫెడరేషన్ల ను తిరిగి ప్రారంభించానన్నారు.