బనగానపల్లె నూతన ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన శ్రీధర్ గుప్తా సత్యసాయి జిల్లాకు చెందిన ప్రభుత్వ భూములను అక్రమంగా బనగానపల్లెలో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలియడంతో ఈ నెల 15న ఉన్నతాధికారులు శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేశారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులను ఇన్ ఛార్జ్ నియమించారు.