ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై

554చూసినవారు
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై
సార్వత్రిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల కోడ్ కు అనుగుణంగా ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, తదితర ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. కోడు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్