ఎండు మిర్చి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. సోమవారం స్థానికుల సమాచారం మేరకు.. కోడుమూరు మండలం కొత్తూరు - విశ్వభారతి ఆసుపత్రి మధ్యలో మిర్చి లోడ్ ను వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కాగా ఈ ప్రమాదంలో రైతులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైతులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి సమాచారం తెలియరాలేదు.