సుంకేసులకు వరద ప్రవాహంతో 6 గేట్లు ఎత్తివేత

67చూసినవారు
తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 28, 960 క్యూసెక్కుల వరద నీటిప్రవాహం కోనసాగడంతో జలాశయం నుంచి 6 గేట్లను ఎత్తి దిగువకు 26, 676 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల బ్యారేజీకి వరద నీటి ప్రవాహం వస్తుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్