కర్నూలు మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సులకు మూడవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండవ ఫేజ్ కౌన్సెలింగ్లు పూర్తి కాగా మిగిలిన ఆరు సీట్లకు మూడవ ఫేజ్ కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఇందుకోసం నూతనంగా
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు నవంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలన్నారు.