మంత్రాలయం: శ్రీమఠంలో హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు

50చూసినవారు
మంత్రాలయం: శ్రీమఠంలో హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం ఆధ్యాత్మిక కేంద్రంలో రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ. 3. 56 కోట్లు సమకూరింది. సోమవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజులకు గానూ రూ. 3, 56, 04, 597 వచ్చింది. అందులో నగదు రూ. 3, 46, 84, 817, నాణేలా రూపేణా రూ. 9, 19, 780 సమకూరింది. అలాగే 64 గ్రాముల బంగారం, 1, 900 గ్రాముల వెండి కానుకలు వచ్చాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్