పెద్ద కడుబూరులోని కంబళదిన్నెకు చెందిన కురువ గూలెప్ప సోమవారం జాలవాడి సచివాలయం సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శరీరమంతా మంటలు అంటుకోవడంతో తట్టుకోలేక ముళ్ల కంపల్లోకి దూకాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి 108 ద్వారా ఆదోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు రెఫర్ చేశారని అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు.