కొత్తపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి రూ. 5 లక్షల గృహ నిర్మాణం సాయం అందజేయాలని సిపిఎం నాయకులు స్వాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జన చైతన్య యాత్రలో భాగంగా కొత్తపల్లి మండలంలోని చిన్న గుమ్మడ పురం గ్రామంలో పర్యటించి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎంతోమంది పేదలు ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు.