నందికొట్కూరు పట్టణం కేసీ కెనాల్ కార్యాలయంలో జరిగిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికల్లో జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి చైర్మన్‌గా, ఎదురూరు గ్రామానికి చెందిన రమణ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామాల రైతులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.